జూలై 10న కానిస్టేబుల్ ప్రీ-ప్రిలిమనరీ గ్రాండ్ టెస్ట్

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు జులై 6(జనం సాక్షి)
 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ నియామకాల్లో పఠాన్ చెరు నియోజక వర్గం లోని నిరుద్యోగ యువత అత్యధిక ఉద్యోగాలను కైవసం చేసుకోవాలనే కృత నిశ్చయంతో ఈ నెల 10 వ తేదీన కానిస్టేబుల్ ప్రీ-ప్రిలిమనరీ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసుల సౌజన్యంతో పటాన్చెరులో నిర్వహిస్తున్న జిఎంఆర్ పోలీస్ ఉచిత శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో పాటు, కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పోటీపడుతున్న యువత కోసం నమూనా పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.  పరీక్ష రాయదలచుకున్న విద్యార్థులు ఈ నెల 7, 8 తేదీలలో పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న జిఎంఆర్ పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈనెల 10వ తేదీ ఆదివారం ఉదయం  10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.