జూ పార్క్‌లో యువకుడి హల్‌చల్‌

share on facebook

హైదరాబాద్‌,నవంబర్‌ 23 జనంసాక్షి : జూపార్క్‌లో కలకలం రేగింది. సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు యువకుడు ప్రయత్నించాడు. గమనించిన జూ సిబ్బంది వెంటనే యువకుడిని అడ్డుకున్నారు. ఎర్రగడ్డకు చెందిన సాయి కుమార్‌ హోటల్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నట్లు జూ సిబ్బంది గుర్తించారు. అయితే సాయికుమార్‌ మానసిక పరిస్థితి సరిగాలేదని చెప్పారు. బహదూర్‌పురా పోలీసులకు యువకుడిని అప్పగించారు. జూ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Other News

Comments are closed.