జేఈఈ పరిక్ష ప్రారంభం
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నగరాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. వరంగల్, తిరుపతి, గుంటూరు, ఖమ్మం నగరాల్లో మొత్తం 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పూట జరిగే బీఆర్క్ పరీక్ష 2 గంటలకు ప్రారంభం కానుంది. జేఈఈ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.


