జేఎన్‌టీయూ వద్ద విద్యార్థిసంఘాల ఆందోళన

హైదరాబాద్‌: జేఎన్‌టీయూలో ఈ రోజు ప్రారంభమైన ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. జీవో నెంబర్‌ 136 ప్రకారం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తి చేయాలని, తెలంగాణ మెడికల్‌ కాలేజిల్లో సిట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. కౌన్సిలింగ్‌ అడ్డుకుంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.