జైల్‌ భరో విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 21: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్‌భరో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్య క్షుడు రాంనాథ్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆదిలాబాద్‌, మంచిర్యాల కేంద్రాల్లో జైల్‌భరో కార్యక్రమం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ జైల్‌భరో కార్యక్రమంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రోజు రోజుకు పెరు గుతున్న ధరలను నియత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విత్తనాలు, ఎర వులు, కుట్రిమ కోరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం అన్ని విధాల విఫలమైనందున ప్రభుత్వానికి పాలించే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.