జోగపూర్ కుడికాలువ మరమ్మతులకు పనులు ప్రారంభం.
పోటో : పనులు ప్రారంభిస్తున్న ఎంపీపీ రమాదేవి.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 6, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలోని జోగపూర్ కుడికాలువ మరమ్మత్తు పనులను మంగళవారం ఎంపీపీ సంతోషం రమాదేవి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టు కుడికాలువ పిచ్చి మొక్కలతో నిండి, కొన్నిచోట్ల కాలువ తెగి నీరు రాక పొలాలు ఎండిపోతున్న విషయం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దృష్టికి తీసుకురావడంతో ఆయన తన స్వంత నిధులు మంజూరు చేశారని ఆమె పేర్కొన్నారు. కాలువ పూడికతీత పనులు ప్రారంభం కావడంతో గొల్లపల్లి, మైలారం రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సింగతి శ్యామల, గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ, మండల టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, నాయకులు సంతోషం ప్రతాప్ రెడ్డి, సింగతి రాం చందర్, గురునాదం ప్రేమ్ సాగర్ గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందూరి రమేష్, రైతులు పాల్గొన్నారు.