టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో 19 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లాలో పలుచోట్ల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 19 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ. కోటి విలువైన 217 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనంచేసుకున్నారు. స్మగ్లర్లనుంచి కారు, సుమో, ఆటో, 4 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో ముగ్గురిపై పీడీ యాక్టు నమోదు చేశారు.