టిడిపి నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారు:హరీష్ రావు 

హైదరాబాద్:నామినెటేడ్ ఎమ్మెల్యే కొనుగోలులో అడ్డంగా దొరికి పోయిన కూడా టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని… తెలంగాణ, ఏపీ ప్రజలు తెలివైన వారు. చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నారని పేర్కొన్నారు. 5 కోట్ల మందికి ప్రతినిధి అని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.