టి ఆర్ ఎస్ తోనే సంక్షేమ పథకాలు మంత్రి జగదీశ్వర్ రెడ్డి
నాంపల్లి సెప్టెంబర్ 11( జనం సాక్షి ) దేశంలోని ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాల అమలు తెలంగాణ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిమండల పరిధిలోని మలపు రాజు పల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం, అదనపు తరగతి గదులు, పల్లె ప్రకృతి వనం లను ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్ లు, 24 గంటల విద్యుత్, రైతు బీమా, రైతుబంధు లాంటి సంక్షేమ పథకాల తో నే తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. అటువంటి తెలంగాణను ఆగం చేయాలన్నా కుట్రతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీ తో చేతులు కలిపి వేల కోట్ల రూపాయలకు కాంట్రాక్టు తెచ్చుకొని మునుగోడు ప్రజలను నట్టింట ముంచారన్నారు. వారి మాటలు నమ్మి బిజెపికి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు పెట్టి, 600 రూపాయల ఆసరా పింఛన్లు కుదించి మరో గుజరాత్ గా తయారు చేసే అవకాశం ఉందన్నారు. మలపు రాజు పల్లి గాను ఈ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనదని, గ్రామ సర్పంచ్ మునగాల సుధాకర్ రెడ్డి ని ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా గెలిపించి ఆదర్శ వంతులైన రాని అన్నారు. ఈ గ్రామానికి సుధాకర్ రెడ్డి అభివృద్ధి పనులను ఎస్సీ కాలనీకి సిసి రోడ్లు, వడ్డ పల్లి రోడ్డు నుండి మల్లేపల్లి వరకు రోడ్డు , అర్హులైన వారికి ఆసరా ఆసరా పెన్షన్ లను వెంటనే మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి తక్కల్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి, జెడ్ పి టి సి వెలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ ఏడు దొడ్డ రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి నరసింహారావు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్, జిల్లా నాయకులు పానగంటి వెంకన్న గౌడ్, బండ తిమ్మాపురం ఎంపిటిసి అనే పాక కిరణ్ కుమార్, ఎస్ డబ్ల్యూ లింగోటం ఎంపీటీసీ బెక్కం రమేష్, సుంకిశాల సర్పంచ్ భాషి పాక రాములు, ఎస్ టి సి ఎల్ మండల అధ్యక్షుడు సపవట్ సర్దార్, గౌరి కిరణ్, బుషి పాక నాగేష్ తదితరులు పాల్గొన్నారు.