టీఎస్‌పీఎస్సీ ముట్టడికి టిఎన్‌ఎస్‌ఎఫ్ యత్నం
– అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, నవంబర్16(జనంసాక్షి) : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య గురువారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించింది. భారీ ర్యాలీగా వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడే బందోబస్తుగా ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సీఎం డౌన్‌డౌన్.. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీచేయాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు కొందరు ఆందోళనకారులను అడ్డుకున్నారు. అక్కడినుండి తరలించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఢంకాబజాయించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల ఊసే మర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్ ఆ హావిూ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాలు వస్తాయని మూడేళ్లుగా నిరుద్యోగులు
ఆశగఆ చూస్తున్నారని.. వారి ఆశలు అడియాశలయ్యే ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీచేయాలని, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.