టీడీపీనే సస్పెండ్ చేశాం: హరీశ్వర్‌రెడ్డి
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబుపై పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. తనను సస్పెండ్ చేయడం కాదు ఏడాదిన్నర కిందటే రాజీనామా చేసి టీడీపీనే సస్పెండ్ చేశామని ధ్వజమెత్తారు. బాబు తెలంగాణ ద్రోహి అని కోపోద్రిక్తులయ్యారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయినా బాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు. బాబు కబంధహస్తాల నుంచి తెలంగాణ టీడీపీ ఫోరం బయటపడాలని సూచించారు.