టీడీపీ నేతల అరెస్ట్‌

రాజమండ్రి: జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వటానికి వెళ్ళీన తెెలుగుదేశంపార్టీ  నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి గొల్లపల్లీ సూర్యరావు, చిక్కాట రామచంద్రరావు, పత్తిపాడు ఎమ్మెల్యే సుబ్బారావు, బాబురమేశ్‌, పి.వెంకటేష్‌, సహ 200మంది కార్యకర్తలను కోరుకొండ వద్ద అరెస్ట్‌ చేసి రాజమండ్రి మొబైల్‌ పోలీస్‌ రిజర్వు కార్యలయానికి వారిని తరలించినారు.