టెండర్ల వాయిదా వెనుక సిటు మాయాజాలం

ప్రైవేట్‌ కార్మికుల ఆరోపణ
విజయనగరం, జూన్‌ 28 : పట్టణంలోని పారిశుధ్యానికి సంబంధించి నాలుగు సార్లు టెండర్లు వాయిదా పడడం వెనుక కార్మిక సంస్థ సిఐటియుతో పాటు దాని గుప్పెట్లో ఉన్న ఓ డమ్మి స్వచ్ఛంద సంస్థ మాయాజాలం కారణంగా కార్మికులు నష్ట పోతున్నారని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్‌ పారిశుధ్య ప్రైవేట్‌ కార్మికుల సంఘ ఆరోపించింది. గురువారం ఇక్కడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీను, కామేష్‌ మాట్లాడారు. కార్మిక సంఘ నాయకులు, అధికారులను సైతం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని వీరు ఆరోపించారు. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలపై లోతైన దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటపడతాయని వీరు పేర్కొన్నారు. కార్మికులతో సమ్మెల చేయిస్తూ స్వలాభం కోసం ఈ సంస్థలు ప్రజలకు, కార్మికులను బలి చేస్తున్నాయని ఆరోపించారు. దీనిపై అధికారులు దర్యాప్తులు జరిపించి టెండర్లను ఆమోదించాలని వీరు కోరారు.