విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉదేశ్యం
అధికారులు నేరుగా గ్రామాలు వెళ్ళి విద్యుత్ సమస్యలను పరిష్కరించే వేదిక
సిఇ బాలస్వామి
మర్రిగూడ, మార్చ్ 17 (జనం సాక్షి)మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించి ట్రాన్స్ఫార్మ్స్ కు మరమ్మతులు చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సి ఇ బాలస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅధికారులు నేరుగా గ్రామాలు వెళ్ళి విద్యుత్ సమస్యలను పరిష్కరించే వేదిక అని అన్నారు.తక్కువ వోల్టేజ్, లూజ్ వైర్లు, బిల్లింగ్ సమస్యలు, మరియు ట్రాన్స్‌ఫార్మర్ల లోపాలను అక్కడికక్కడే (Spot) లో పరిష్కరించి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
లోడ్ బ్యాలెన్సింగ్, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, మరియు అగ్రికల్చర్ సర్వీసుల సమస్యలను పరిష్కరిస్తారు అని పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు, డిజిటల్ చెల్లింపులు, మరియు సురక్షితమైన విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.వినియోగదారుల సమస్యలను తెలుసుకుని, నాణ్యమైన మరియు అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు హామీ ఇస్తారు అని తరచుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయే ఫీడర్లను గుర్తించి, వాటి మరమ్మతులు చేపడతారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి వెంకటేశం, డిఈ బాల్య నాయక్, ఏడి సాగర్ రెడ్డి, ఏఈ సందీప్, ఫోర్ మెన్ రవికుమార్ మరియు మర్రిగూడ విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.



