టెన్త్‌లో ఈ యేడాది కూడా ఆరు పేపర్లే
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్,అక్టోబర్11 (జనంసాక్షి): పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2021`22 విద్యా సంవత్సరానికి గానూ.. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కో స్జబెక్టుకు ఒక్కో పేపరే పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు పది పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2020`21లో 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా.. 2021`22లో కూడా ఈ విధంగానే అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడం గమనార్హం.