టేకులపల్లి లో వినాయకుడికి 4 లక్షల రూపాయలతో లక్ష్మీ పూజ
టేకులపల్లి, సెప్టెంబర్ 2 (జనంసాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్లో మూడు రోజులుగా విశేషంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు . అందులో భాగంగా శుక్రవారం రాత్రి వినాయకుని మండపంలో నాలుగు లక్షల రూపాయల నోట్లతో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజలు అందించారు. ఈ నిర్వహణ అంత ఉత్సవ కమిటీ సభ్యులు ఎంతో శ్రద్ధతో నోట్లతో అలంకరణ చేశారు . ఎంతో సుందరంగా అలంకరించిన మండపాన్ని భక్తులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల తిలకించడానికి వచ్చారు.