టోల్‌ పన్ను ఎత్తి వేయాలని కిసాన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళన

ఢిల్లీ: ఢిల్లీ, ఆగ్రాలను కలుపుతూ ఇటీవలే ప్రారంభించిన యమునా ఎక్స్‌ప్రెస్‌పై ఈ రోజు పెద్ద సంఖ్యలో రైతులు చేరి ఆందోళన చేపట్టారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో రైతులు ఎక్స్‌ప్రెస్‌వూపై టోల్‌ పన్ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దారిలో వెళ్లె రైతులకు టోల్‌ పన్ను మినహాయించాలని డిమాండ్‌ చేశారు.