ట్యాంక్‌బండ్‌పై కూల్చిన విగ్రహాలను వచ్చే నెలలో పున:ప్రతిష్ఠ

హైదరాబాద్‌: మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై కూల్చిన విగ్రహాలను వచ్చే నెల మొదటివారంలో పున:ప్రతిష్ఠిస్తామని సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ స్పష్టం చేశారు. ఈ నెల 30న తెలంగాణ మార్చ్‌ ఉన్నందున అక్టోబరు మొదటి వారంలో 9 విగ్రహాల ఏర్పాటుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.