ట్రాక్టర్ బోల్తా : ఐదుగురి మృతి
కర్నూలు: పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు మృతి చెందిన ఘటన కర్నాలు జిల్లా వెలుగోడు మండలం వేల్పనూరులో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో 10 మందిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. నంద్యాలలో శిల్పావారి సామూహిక వివాహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారి వివరాలు.. వహిదాబీ (35), రసూల్‌బీ (30), రమిజా(30), అబ్దుల్లా (12). అబ్డుల్ సత్తార్ (3)



