ట్రాక్టర్‌ బోల్తా.. మహిళ మృతి

నల్లగొండ, మార్చి 24: జిల్లాలోని బీబీనగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. ఓ ప్రైవేటు వెంచర్‌లో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.