ట్రాఫిక్ జాం కాకుండా చూడండి

ubqq505c హైదరాబాద్

పుష్కరాలపై ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపారు. వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో పుష్కరాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. శని, ఆదివారం లాగానే ఇవాళ కూడా రద్దీ ఎక్కువ ఉందని సీఎం కేసీఆర్‌ కు అధికారులు తెలిపారు. మధ్యాహ్నానికే ధర్మపురికి 6 లక్షల మంది చేరుకున్నారనే సమాచారంతో.. అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని డీజీపీ అనురాగ్‌ శర్మను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పుష్కరఘాట్లకు వెళ్లే రహదారులపై ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా చూడాలని చెప్పారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు డీజీపీ అనురాగ్‌ శర్మ వెంటనే బయలుదేరి ధర్మపురి వెళ్లారు. ఈ సమీక్షలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సీఎంవో కార్యదర్శి నర్సింగరావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.