డబ్బులకోసం కుమారుడి విక్రయం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన జానపాటి తలుపులు, నాగమ్మలు కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొంత కాలంగా విడిగా ఉంటున్నారు. ఇటీవల వీరి ఆరు సంవత్సరాల కుమారుడు పేతురును భీమడోలు మండలం సూరపుగూడెం గ్రామనికి చెందిన సకాలు, దుర్గా దంపతులకు దత్తత పేరుతో రూ.85వేలకు విక్రయించాడు. ఈ విషయమై బాలుడి తల్లి నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు బాలుడ్ని తల్లివద్దకు చేర్చారు.