డబ్బు చెల్లించని సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకోవాలి:పీఏసీ

హైదరాబాద్‌:  ప్రభుత్వ భూములను వేలం ద్వారా పోంది డబ్బు పూర్తిగా పోందని సంస్థలనుంచి భూములను వెనక్కి తీసుకొవాలని ప్రజా పద్దుల సంఘం సూచించింది. శాసనసభ కమిటీ హాలులో చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమయింది.  పీఏసీ గ్రేటర్‌ హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ, కార్పోరేషన్ల పద్దులను సమీక్షించింది. హైదరాబాద్‌ చుట్టు పక్కల కోకపేట, రాయదుర్గం, మియపూర్‌, ప్రాంతాల్లోని భూముల వేలం ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని కమిటీ పరిశీలించింది. సంస్థల నుంచా కాక పూర్తి ఆదాయం ప్రభుత్వానికి రానందున తగిన చర్యలు తీసుకొవాలని అధికారులను కమిటీ ఆదేశించింది. ఈ నెల30న హైదరాబాద్‌, రంగారెడ్డి  జిల్లాల్లోని భూముల కేటాయింపులపై మరోమారు. చర్చించాలని నిర్ణయించారు. విశాఖ భూకేటాయింపులకు సంబంధించి అధికారులు ఇచ్చిన నివేదికపై కమిటీ సంతృప్తి వ్యక్త పరచింది.