డయల్‌యువర్‌ ఆర్డీఓ తో సమస్యలకు సత్వర పరిష్కారం

జగిత్యాల , జూన్‌11 (జనంసాక్షి):

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం బయల్‌ యువర్‌ ఆర్డీవో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగిత్యాల రెవెన్యూ డివిజినల్‌ అధికారి యం. హనుమంత రావు తెలిపారు. సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఆర్డీవో కార్యక్రమానికి  డివిజన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 28మంది తమ సమస్యల పరిష్కారం కోసం ఫోన్‌ ద్వారా తన దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. కొరుట్ల మండల ప్రాంతానికి చెందిన టి.కరుణాకర్‌ రెవేన్యూ సదస్సు ఆర్జీ పెట్టుకున్నప్పటికి ఆర్‌ఓఆర్‌లో నమోదు చేయడంలేదని , కుల దృవీకరణ పత్రం ఇవ్వడం లేదని , ఇబ్రహింపట్నం మండలం మేడిపల్లి కి చెందిన ముగ్గు వీరయ్య, సర్వే97లో పట్టాదార్‌ పాస్‌ బుక్కు , టైటిల్‌ లో పేర్కోన్నవిధంగా మొఖ మీద భూమిఆ తక్కువగా ఉన్నదని దర్మపురి మండలంజైనకు చెందిన మోటరి ముచ్చన్న , కోరుట్ల బస్సు డిపోనుండి కోనరావుపేట గ్రామానికి , దాసరి మాపేంద్ర ,ఐలాపూర్‌కు బస్సు సౌకర్యం కల్పించవ లసిందిగా కోరారు. ఇస్లాంపూర్‌ కల్వర్ట్‌ పూర్తి చేయవలసిందిగా లాల్‌ మహ్మద్‌ రేషన్‌ కార్డు మంజూరు చేయవలసిందిగా జంబర్తి మమేష్‌, రోడ్డు ప్రక్కనున్న ప్లెక్సీలు తీయవలసిందిగా రమేష్‌ అభ్యర్తించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ జెఆర్‌ సురేష్‌ , డిఈ వెంకటేశ్వర్లు, టిపిఓ మధుసూధన్‌, డిప్యూటీ తహసీల్‌దార్‌ ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.