డయల్ యువర్ చైర్ పర్సన్ కు 20 ఫిర్యాదులు..
వికారాబాద్ జనం సాక్షి ఫిబ్రవరి 27
ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్న డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమానికి ఈవారం 20 ఫిర్యాదులు వచ్చాయని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు అన్నారు. కార్యక్రమం అనంతరం చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమంలో మా దృష్టికి వచ్చిన సమస్యను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది అన్నారు. కాబట్టి పట్టణ ప్రజలు మీ వార్డులో, మీ ఇంటి పరిధిలో ఎలాంటి సమస్య ఉన్న డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమానికి ఫోన్ చేయగలరని కోరారు.