డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లో తెలంగాణ-కాంగ్రెస్‌ నేతలు భేటీ

హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ నివాసంలో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు బసవరాజు సారయ్య, ప్రసాద్‌ కుమార్‌, జానారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కే. కేశవరావు, ఎంపీలు వివేక్‌, పొన్నం ప్రభాకర్‌, మందా జగన్నాథం, గుత్తా సుఖేంధర్‌, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్‌, కొమటిరెడ్డి రాజగోపాల్‌లు హాజరయ్యారు.