డిమాండ్ల పరిష్కారానికి 3 వారాల గడువు కోరిన ఎపి కేబినెట్ సబ్ కమిటీ..

హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎపి కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సబ్ కమిటీ మూడు వారాల గడువు కోరింది. సమ్మె విరమించాలని సబ్ కమిటీ విజ్ఞప్తి చేసింది. చర్చించి నిర్ణయం తీసుకుంటామని కార్మిక సంఘాల నేతలు వెల్లడించాయి.