డీఈవోపై ఉపాధ్యాయురాలు ఫిర్యాదు

కర్నూలు: జిల్లా విద్యాశాఖాధికారి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బదిలీ విషయంలో డీఈవో అమర్యాదగా ప్రవర్తించారని ఆమె మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.