డీఎస్సీ పరీక్ష నిర్వహణకు లైన్‌క్లియర్‌

హైదరాబాద్‌: డీఎస్సీ పరీక్ష నిర్వహణకు లైన్‌క్లయరైంది. 2012 డీఎస్సీలో డిగ్రీ అర్హత కలిగి ఉన్న డీఎడ్‌ అభ్యర్థులకు స్కూల్‌ అసిస్టెంట్‌ రాసుకోవడానికి అవకాశం కల్పించాలని ఏపీ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ట్రిబ్యునల్‌ తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. పరీక్ష నిర్వహణకు అభ్యంతరం లేదని ఫలితాలు మాత్రం విడుదల చేయవద్దని కోర్టు ఆదేశించింది. తుది తీర్పుకు లోబడే ఫలితాలు ఉండాలని కోర్టు ప్రభుత్వానికకి తెలిపింది. తుది తీర్పును హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. డీఎడ్‌ అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు ఇస్తే వారికోసం ప్రభుత్వం మరోసారి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అనంతరం రెండు ఫలితాలు ఒకేసారి విడుదల చేయాల్సి వస్తుంది.