డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా ఆందోళనలు

హైదరాబాద్‌: డీజిల్‌ ధరలు పెంపు, గ్యాస్‌ సిలిండర్ల వాడకం పరిమిత నిర్ణయాలపై విపక్షాలు అగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్త ఆంందోళనలకు భాజపా,సీపీఐ పార్టీలు పిలుపునిచ్చాయి. కేంద్ర వైఖరికి నిరసనగా సీపీఐ నేడు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనుంది. నేడు, రేపు అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాలని భాజపా నిర్ణయించింది.