డీజీపీ ఏరియల్‌ సర్వే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి)  :

రాష్ట్ర రాజధాని నగరంలో జరుగుతున్న తెలంగాణ మార్చ్‌ను డీజీపీ దినేశ్‌రెడ్డి హెలిక్టాపర్‌ లో ఏరియల్‌ సర్వే చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని హెలిక్టాపర్‌ ద్వారా ట్యాంక్‌బండ్‌, చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లోని మార్చ్‌కు తరలివెళ్లే ప్రధాన కూడళ్లతో పాటు కొనసాగుతున్న మార్చ్‌ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం విమానాశ్రయానికి చేరుకుని కార్యాలయానికి తిరిగి వెళ్లారు.