డీపీవో పరిధిలో బదలీలు కోరుతూ దరఖాస్తులు

ఖమ్మం, జూన్‌ 27 : జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో ఉద్యోగుల బదలీల కౌన్సెలింగ్‌ ఈ నెల 29న జడ్పీ కార్యాలయంలో జరుగుతుందని డీపీవో విల్సన్‌బిన్ని తెలిపారు. బదలీలను కోరుతూ 35 మంది ఉద్యోగులు దరఖాస్తులు చేశారని అన్నారు. వీరిలో 17 మంది 5 సంవత్సరాలు పూర్తి చేసినవారని అన్నారు. 5 సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి అయిన జూలూరుపాడు ఇవోఆర్‌డితోపాటు రెండు సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి అయిన ముగ్గురు ఇవోఆర్డీలు బదలీకి దరఖాస్తులు చేశారని అన్నారు. గ్రామ పంచయతీ కార్యదర్శులు 18 మంది, ఒక సీనియర్‌, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ ఒకరు దరఖాస్తు చేశారని తెలిపారు. ఈ నెల 29న వీరిందరిని కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు విల్సన్‌ తెలిపారు.