డెల్టాకు నీరిస్తే ఎవరి ప్రయోజనాలు దెబ్బతినవు

హైదరాబాద్‌: కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల వల్ల ఏ ప్రాంత ప్రయోజనాలు దెబ్బ తినవని ఆ జిల్లా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేశ్‌లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిసిన వీరు డెల్టా నీటి విడుదలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. ఈనెల 4వ తేదిన సాయంత్రం ఐదు గంటలకు ప్రకాశ బ్యారేజి నుంచి నీటిని డెల్టా కాలవలకు విడుదల చేస్తామని అధికారులు చెప్పినట్లు వివరించారు. డెల్టాకు నీటి విడుదల వల్ల ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని వారు వివరించారు.