తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందాలి..

వేములవాడ రూరల్‌, మే26 (జనంసాక్షి): రైతులు రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రి య ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను ఉపయోగిం చి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందవ చ్చని సంయుక్త వ్యవసాయ సంచాలకులు ధర్మానా యక్‌ అన్నారు. వేములవాడలో శనివారం నిర్వహి ంచిన రైతుచైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంప్లెక్స్‌ ఎరువులను దుక్కి, పంట కాలంలో ఒకేసారి వాడాలని అన్నారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా రైతులు నాణ్యమైన విత్తనాలను తయారు చేసుకోవాలన్నారు. రైతులు ఒక వ్యవసాయం మీదనే ఆధారపడకుండా పాడిపశువుల పెంపకం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచి ంచారు. రైతులు తీసుకున్న పంట ఋణాలను సకాలంలో చెల్లించి వడ్డీ మాఫీని పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్యాల డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజేశ్వర్‌, ఏరువాక కేంద్రం సమన్వయకర్త సుధాజాకబ్‌, వేములవాడ వ్యవసాయాధికారి కృష్ణ, ఏఈఓలు. గంగాజల, సుమలత, రైతులు పాల్గొన్నారు.