తక్షణ సాయం అందించి రాష్ట్రాన్ని ఆదుకోవాలి : సీఎం

బెంగళూరు : ఆర్ధిక మంత్రి చిదంబరం అధ్యక్షతన ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల
ముఖ్యమంత్రుల సమావేశంలో మన రాష్ట్ర సీయం కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. నీలం
తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఈ సంధర్భంగా
కిరణ్‌ కేంద్రాన్ని కోరారు. తుపాను నష్టానికి పరిహరం కింద రూ. 1550 కోట్ల తక్షణ
సాయం అందించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.