తడి బొగ్గుతో తగ్గిన ఎన్టీపీసీ విద్యుత్తు సామర్థ్యం

గోదావరిఖని/జ్యోతినగర్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తడి బొగ్గు రావడంతో రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు ఉత్పత్తి సామరర్థ్యాన్ని అధికారులు తగ్గించారు. ప్రస్తుతం 2600మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రామగుండం ఎన్టీపీసీ తడి బొగ్గు రావడంతో 2000మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే చేయగలుగుతోంది. తడిగా ఉండటంతో బంకర్లలో బొగ్గు జామ్‌ అయి ముందుకు కదలడం లేదు. దీంతో అధికారులు విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించారు. గత నెలలో 200మెగావాట్ల 3వ యూనిట్‌ను వార్షిక మరమ్మతులు చేయగా, ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి విద్యుత్తు ఉత్పత్తికి వస్తోంది. విద్యుత్‌ ఉత్పత్తి పూర్థిస్థాయిలో రాగానే నాలుగు రోజుల్లో 500మెగావాట్ల 7వ యూనిట్‌ను వార్షిక మరమ్మతుల్లోకి తీసుకునే ప్రణాళికల్లో అధికారులు నిమగ్నమయ్యారు.