తనపై చేసిన ఆరోపణలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

share on facebook

తనపై చేసిన ఆరోపణలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు *తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గౌడ్ తూప్రాన్ జనం సాక్షి డిసెంబర్ 2:: తనపై నిరాధారణమైన చేసిన ఆరోపణలపై జిల్లా ఎస్పీకి సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తూప్రాన్ పట్టణానికి చెందిన కొందరు కౌన్సిలర్లు వ్యక్తులు తాను అనేక అవినీతి ఆరోపణలు చేశానని భూకబ్జాలు చేశానని ఆరోపణలు చేశారని ఇలాంటి నిరాదార ఆరోపణ లు చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తాను పురానని చెప్పారు వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆయన వివరించారు తన కుటుంబం గత 30 సంవత్సరాల నుండి భూస్వాముగా ఉన్నామని తన తండ్రి సర్పంచుగా తన తమ్ముడు వెంకట్ గౌడ్ సర్పంచ్ గా ప్రస్తుతం తాను తూప్రాన్ మున్సిపల్ చైర్మన్గా తన తమ్ముని భార్య అరుణ కౌన్సిలర్గా గెలిచామని అవినీతి ఆరోపణలు చేస్తే తమకు ప్రజలు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు తాను గత 25 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారుగా అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్ననని చెబుతూ తాము కొనే భూమిపై లీగల్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతనే కొంటామని ఆయన చెప్పారు లాయర్ అనుమతి లేనిది ఎలాంటి భూములు వివాదమైన భూములు కొనమని ఆయన తెలిపారు హనుమాన్ దేవాలయ భూమి కొన్నానని ఆరోపిస్తున్న వారు అది హనుమాన్ దేవాలయ భూమి అని నిరూపిస్తే పదవికి రాజీనామా చేసి భూమి దేవాలయానికి అప్పజెప్తానని అన్నారు తాను తన కుటుంబం పూర్వం నుండి రాజకీయంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు శిక్షణలో పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేయనని అది పార్టీకి తనకు నష్టమేనని చెప్పారు ఇప్పటివరకు తాను పార్టీ సిద్ధాంతాలకు క్రమశిక్షణ కార్యకర్తగా ఉన్నానని మున్సిపల్ చైర్మన్ పదవికి ముఖ్యమంత్రి నియోజకవర్గమైన ముఖ్యమంత్రి కి మంత్రి హరీష్ రావులకు పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటటువంటి ఈ ఒక్క పని చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని అన్నారు తాను ఇప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని అది తన వ్యాపార కర్తవ్యం అని అన్నారు తనపై అవినీతి ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్ రఘుపతి వెంకటగౌడ్ మామిడి వెంకటేష్ సత్యలింగం నారాయణ రవీందర్ జనార్దన్ రెడ్డి సత్తార్ నవీన్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.