తనిఖీ కేంద్రంపై తాలిబన్ల దాడి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్‌ ప్రాంతంలోని ఓ చెక్‌పోస్ట్‌ పై సాయుధ తాలిబన్లు బుధవారం దాడి చేశారు. సైనిక దాళాల ఎదురుకాల్పుల్లో 10 మంది తాలిబన్లు మృతి చేదారని, ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పర్హాంగ్‌ బాబా ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో 9 మంది సైనికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఎదురుకాల్పుల అనంతరం సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు.