తప్పుడు నివేదికి ఇచ్చిన డిప్యూటీ సర్వేయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 29 (జనంసాక్షి) : సిరిసిల్ల డివిజన్‌ పరిధిలోని గంభీరావ్‌పేటలో మూడెకరాల 20 గుంటలు ఆలంగిరి కబర్‌స్ధాన్‌ స్థలం విషయంలో సర్వే అండ్‌ లాండ్‌ డిపార్టుమెంట్‌కు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ ఇంతకు ముందు ఏకపక్షంగా సర్వేచేసి తప్పుడు రిపోర్టు ఇచ్చినం దున అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేగాకుండా ఇదే శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారి అయిన ఏ.డీ తాజాగా గంభీరావుపేట ముస్లిం ప్రజలలతో పాటు మజీద్‌ అండ్‌ ఈద్గా మేనేజ్‌మెంట్‌ జిల్లా కమిటీ సమక్షంలో సర్వే చేయించాలని జిల్లా అధ్యక్షులు అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మాద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌, చీఫ్‌ అడ్వయిజర్‌ షేక్‌ అబూబకర్‌ ఖాలీద్‌లు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వక్ఫ్‌ బోర్డు గెజిట్‌లో ఉన్న మూడెకరాల 20 గుంటల భూమి కబరస్థాన్‌కు చెందినదేనని రికార్టులు స్పష్టం చేస్తుండగా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మాజీ శాసన సభ్యులు కటకం మృత్యుంజయం కబరస్థాన్‌ భూమి ని కబ్జా చేసి దౌర్జన్యానికి దిగుతుండటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. మృత్యుం జయం దురాక్రమణను నిరసిస్తూ గంభీరావుపేట ముస్లిం ప్రజానీకం సంఘటితమై ధర్నాలు, రాస్తారో కోలు,  ఆందోళనలు చేస్తున్న తరుణంలో ప్రజలకుగానీ, తమ కమిటీకి గాని తెలియకుండా డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ రహస్యంగా తూతుమంత్రంగా సర్వే జరిపించారని వారు ఆవేదన చెందారు. తాజాగా తన కుమారుడు జేసీబీతో సమాధులను తొలగించే ప్రయత్నం చేశారని దాంతో 200 మంది ముస్లిలు ఆయనను అడ్డుకొని ఆ పనులను నిలిపివేశారని తెలిపారు. ఇప్పటికైనా మృత్యుం జయంపై ,అతని కుమారునిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ గంభీరావు పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిిర్యాదు చేయగా సమాధులు ఉన్న ప్రాంతంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారని వారు తెలిపారు.