తమ్మిలేరు జలాశయంలోకి భారీగ వరద నీరు

చాట్రాయి: ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లా తమ్మిలేరు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం లాకులు ఎత్తి దిగువకు 4,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 5 వేలకు చేరితే మొదటిప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు టీఆర్పీ ఏఈ కృష్ణంరాజు చెప్పారు. నీటి విడుదలతో ఏలూరు పరివాహక  ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.