తహసిల్దార్ భగవాన్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన జేఏసీ
– గోదావరి వరద ముంపు బాధితులు మమ్మల్ని కాపాడండి సారూ… అంటూ వినతి పత్రం.
– 16వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష.
బూర్గంపహాడ్ సెప్టెంబర్03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ముందు 16 రోజుల నుండి గోదావరి ముంపు బాధితులు మమ్మల్ని కాపాడాలని స్థానిక మండల ప్రజలు జేఏసీగా ఏర్పడి, ఆ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలు కొనసాగుతున్నాయి. రిలే నిరాహారదీక్షలో భాగంగా శనివారం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి స్థానిక తాసిల్దార్ భగవాన్ రెడ్డికి వినతిపత్రం జేఏసీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ కమిటీ నాయకులు మువ్వా వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఒక నెలలోనే గోదావరి ఈ ప్రాంతంలో మూడుసార్లు వచ్చి ఇల్లు పొలాలు పూర్తిగా నీట మునిగి నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఇప్పటికీ గోదావరి వరద బాధితులకి ముఖ్యమంత్రి ప్రకటించిన వరద బాధితులు నష్టపరిహారం పదివేల రూపాయలు ఇప్పటివరకు చాలామందికి రాలేదని వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించాలని, పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే నష్టాన్ని ప్రభుత్వమే వారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 18 సంవత్సరాలు నిండినప్రతి ఒక్కరికి ఇవ్వాలని, 2013 భూ సేకరణ చట్ట ప్రకారం భూములకి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు జేఏసీ నాయకులు కె వి రమణ, దామర శ్రీనివాస్, టి డి పి మండల అధ్యక్షులు తాళ్లూరు జగదీశ్వర్ రావు, దాసరి సాంబ, రాయల వెంకటేశ్వర్లు, కుంజ వెంకటరమణ, జేఏసీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల వారు, వరద ముంపు బాధితులు పాల్గొన్నారు.