తాలిపేరు గేట్లు ఎత్తివేత

చర్ల: ఖమ్మం జిల్లాలోని తాలిపేరు  ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరడంతో అధికారులు 13 గేట్లను ఎత్తి నీటికి కిందకు వదిలారు. ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న  వర్షాలతో ప్రాజెక్టులోకి  నీరు వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి భారీగా వరదనీరు రావడంతో గేట్లను ఎత్తి గోదావరిలోని నీటిని వదిలారు.