తిరుపతిలో ఘనంగా గోపూజ

తిరుమల,నవంబర్‌21: మనగుడి కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం  ఆధ్వర్యంలో 400 ఆలయాల్లో గోపూజ నిర్వహించారు. గోపూజద్వారా మన సంప్రదాన్ని గైరవించాలన్న సంకేతాలను ఇచ్చారు. హిందూ సంప్రదాయంలో గోవుకు విశిష్టస్థానం ఉందని.. కార్తీక మాసంలో గోపూజ చేయడం శ్రేష్టమని టిటిడి  అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇవో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో గోశాల ఏర్పాటు చేస్తామన్నారు.  దే ప్రతి జిల్లాలోనూ గో సంరక్షణ శాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తొలిదశలో నాలుగు జిల్లాల్లో రూ. 5 కోట్లతో సంరక్షణ శాలలు ఏర్పాటుచేసినట్లు ఆయన ప్రకటించారు. గోసంరక్షణ శాల నిర్వహణకు విరాళాలు అందించే దాతలకు ప్రత్యేక పూజా సౌకర్యాలు కల్పిస్తామని ఈవో చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు కూడా పాల్గొని ప్రత్యేక పూజలు చేవారు. ఇదిలావుంటే తిరుమలలో రద్దీ  కొనసాగుతున్నది బుధవారం ఉదయం 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆలయంలో మహాలఘు దర్శనం అమలు చేస్తున్నారు. మంగళవారం తిరుమలేశున్ని 67,007 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు.