తిరుపతి రుయా ఆసుపత్రిలో మరో చిన్నారి మృతి

తిరుపతి: రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలో నిన్న అయిదుగురు చిన్నారులు మృతి చెందిన సంఘటన మరవక ముందే అదే ఆసుపత్రిలో మరో చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో పసి ప్రాణాలు బలి అవుతున్నాయని తల్లీదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు మంత్రి గల్లా అరుణాకుమారి ఆసుపత్రిని సంధర్శించి వైద్యుల నిర్లక్ష్యం లేదని మంత్రి చెప్పిన విషయం విదితమే.