తిరుమలలో అగ్ని ప్రమాదం
రంగంలోకి దిగిన ఆక్టోపస్ బృందం
తిరుమల : తిరుమలలోని అన్నదాన సత్రం గోదాంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లలేకపోతున్నారు. దీంతో ఆక్టోపస్ దళాలు రంగంలోకి దిగాయి. గోదాం వెనక ద్వారం పగలగొట్టి లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనాకు అధికారులు వచ్చారు.


