తీరం దాటిన గులాబ్‌ తుఫాన్‌

share on facebook

తుపాన్‌ ప్రభావంతో భారీగా వర్షాలు
శ్రీకాకుళం తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు
జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా
పలు ప్రాంతాల్లో నేల కూలిన చెట్లు
తుఫాన్‌ ప్రభావంపై సిఎం జగన్‌ ఆరా
విశాఖపట్టణం/విజయవాడ,సెప్టెంబర్‌27(జనంసాక్షి) గులాబ్‌ తుఫాన్‌ పరభావంతో ఎపివ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గులబ్‌ తుపాన్‌ కళింగపట్నం`గోపాలపూర్‌ మధ్య గులాబ్‌ తుపాను తీరం దాటింది. జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భావనపాడు, నౌపాడ ప్రాంతాల్లో పలు చెట్లు నేల కూలాయి. తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం ` విజయనగరం` శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు. అక్కునపల్లి బీచ్‌లో ఓ పడవ బోల్తా పడిరది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా, నలుగురు మత్స్యకారులు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు.గులాబ్‌ తుఫాన్‌ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ భారీ వృక్షం నేల కూలింది. ఆమదాలవలస పట్టణంలోని డిగ్రీ కాలేజి నుంచి తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లే రహదారిలో వఅక్షం దారి కి అడ్డంగా కూలింది. దీంతో వాహనచోదకులు, పాదచారులు రాకపోకల చేసేందుకు వీల్లేకుండా పోయింది. స్థానికుల సమాచారం మేరకు మున్సిపల్‌ సిబ్బంది వచ్చి చెట్టును తొలగించి రహదారిని క్లియర్‌ చేశారు.దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, గులాబ్‌ తుఫాన్‌ పై విశాఖ కేంద్రంగా ఏపీ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్య నాథ్‌ దాస్‌ సవిూక్ష నిర్వహించగా, విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు సవిూక్ష చేపట్టారు. తుపాను తీరం దాటే సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలోని 15 మండలాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి అందజేస్తూ చర్యలు చేపడుతున్నారు. కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. భారీ వర్షానికి విమానాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. సోమవారం ఉదయం వర్షం కారణంగా ఇండిగో విమానం ల్యాండ్‌ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొడుతోంది. ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం సుమారు అరగంట నుంచి గాలిలో చక్కర్లు కొట్టింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిడదవోలు ఆర్టీసీ బస్‌ స్టాండ్‌ జలమయంగా మారింది. జండాలా వీధిలో భారీ వృక్షం నేలకొరిగింది. నిడదవోలు ఎర్నగూడెం రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. గులాబ్‌ తుఫాన్‌ కారణంగా అరకులోయ, అనంతగిరి మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి తోడు భారత్‌ బంద్‌ కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. అరకులోయ మండలంలో చొంపి వద్ద బొండాం, కొత్తవలస మద్య అరకులోయ కోడి గడ్డ వంతెనపై నీరు ప్రవహిస్తోంది. అరకులోయ ఘాట్‌ రోడ్‌లో పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారిలో సుమారు రెండు అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. దీంతో పర్యాటకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Other News

Comments are closed.