తీరప్రాంత ఇసుక అక్రమాలపై ప్రత్యేక చర్యలు
కాకినాడ,ఫిబ్రవరి14(జనంసాక్షి): సముద్ర తీర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నవారిపై కేసులు నమోదు చేసేందుకు నడుం బిగించారు. అక్రమార్కులనుగుర్తించి తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలో రెవెన్యూ సిబ్బందిని మరింత అప్రమత్తం చేసి ఎక్కడా తవ్వకాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకునేందకు కఠినచర్యలు అవలంబిస్తున్నారు. అక్రమార్కులను ఆగడాలను అరికట్టేందుకు ఆయా మండల తహసీల్దార్లతో కలిపి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సత్యనారాయణ నిర్ణయించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సముద్ర తీరంలోని ఇసుకను తవ్వినా, తీరాన్ని కాపాడే చెట్లను నరికినా తగు చర్యలు తీసుకునేలా తహసీల్దార్లకు సూచనలు చేసారు. అలాగే కోనసీమలోని సముద్ర తీర ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై నిఘా ఏర్పాటు చేయించారు. ఇప్పటికే సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లోని సముద్ర తీర గ్రామాల్లో వీర్వోలచే పరిశీలన చేయించారు. అక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలపై రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆ మండలాల తహసీల్దార్లకు సూచనలు చేశారు.