తీరప్రాంత గస్తీకి విమానాలు

బీజింగ్‌: తీరప్రాంత గస్తీకి మానవరహిత విమానాల (యూఏవీ) ను మోహరించనున్నట్లు చైనా ప్రకటించింది. పొరుగుదేశాలతో వివాదులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుక్నుట్లు బుధవారం తెలిపింది. తీరప్రాంత రాష్ట్రాల్లో 11 యూఏవీ స్థావరాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా అని ఓ అధికారి తెలిపారు. ఈ ప్రాజెక్టు ఎంత కాలంలో అమల్లోకి వస్తుందనే వివరాలను వెల్లడించలేదు కానీ, ప్రతి స్థావరంలో ఒక్కో విమానం చొప్పున ఉంచనున్నట్లు గ్జిన్హువా న్యూన్‌ పేర్కొంది.