తూర్పులో కాషాయం జెండా ఎగురవేస్తాం..
-కార్యకర్తలకు అండగా ఉంటాం
-ఎర్రబెల్లి ప్రదీప్ రావు
-12వ డివిజన్ లో వివిధ పార్టీల నుంచి బిజెపి పార్టీలోకి భారీగా చేరికలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 11(జనం సాక్షి)
బిజెపి నాయకులు శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో జిల్లా సెక్రటరీ నాగబోయిన రాంఖీ యాదవ్, డివిజన్ అధ్యక్షులు క్యాతం రాజు, జిల్లా ఉపాధ్యక్షురాలు కాసు శిల్ప చొరవతో డివిజన్ 12 దేశాయిపేటలో టిఆర్ఎస్ పార్టీతో పాటు వివిధ పార్టీల నుంచి సుమారు 300 మంది బిజెపి పార్టీలోకి చేరారు. కాపు నాయకుడు సోల శేఖర్, జూలూరి బాస్కర్ గౌడ్, జన్ను వీరేష్, కన్నెబోయిన మధు, గువ్వల మధు, కర్నాకర్, బబ్లూ, రాకేష్, డేవిడ్, నాగరాజు, మహిళా నాయకురాలు కొమురమ్మ, రమ, కవిత ఆదివారం జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కొండేటి శ్రీదర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తూర్పు నియోజకవర్గ ఇంచార్జి కుసుమ సతీష్, రత్నం సతీసా, బాకం హరిషంకర్, బోడ విజయ్, తాబేటి వెంకట్ గౌడ్, యోగానంద్, జూలూరి నయనేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తాం అన్నారు. తూర్పు నియోజకవర్గ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ యొక్క పరిపాలనా దక్షతకు, సంక్షేమ పథకాలకు ఆకర్షకులై యువత పెద్ద ఎత్తున బిజెపి పార్టీలోకి చేరారు. కేంద్రప్రభుత్వ నిధులతోనే నగరం అభివృద్ధి పధంలో సాగుతుందని అన్నారు.
Attachments area