తూ.గో జిల్లాలో మూడో రోజు సీఏం పర్యటన

కాకినాడ: గత రెండురోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఇందిరబాట కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సోమవారం జిల్లా కేంద్రం కాకినాడలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు సీఎం రోడ్లూ భవనాల అతిథి గృహం నుంచి బయలుదేరి కేంద్ర మంత్రి వళ్లంరాజు ఇంటికి అల్ఫాహార విందుకు వెళ్తారు. అక్కడ నుంచి 9:30గంటలకు కలెక్టర్‌కు చేరుకుని జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 11గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అక్కడ నుంచి సర్పవరం జంక్షన్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 2గంటలకు తిరిగి ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహానికి చేరుకుని భోజనం చేస్తారు. 3గంటలకు ప్రభుత్వాసుపత్రి వద్ద నిర్మాణం చేసిన సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్సును ప్రారంభిస్తారు. అనంతరం పోలీస్‌ పేరేడ్‌ మైదానం నుంచి హెలీకాప్టర్‌లో బిక్కవోలు వెళ్తారు., అక్కడ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. అనపర్తి వెళ్లి ఆర్‌వోబీని ప్రారంభిస్తారు. అక్కడే పేదలకు పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం హెలీకాప్టర్‌లో విశాఖపట్నం వెళ్తారు.